Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నవంబరు 11.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్

Vijayasai Reddy fixes date for new political party on November 11
Advertisement
  • కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై విజయసాయి రెడ్డి పోస్ట్
  • నవంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలో పార్టీ ఆవిర్భావ సభ
  • రెండు పార్టీలు, రెండు కుటుంబాల దోపిడీకి ముగింపు పలకడమే లక్ష్యమని వెల్లడి
  • ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్, యువతకు 100% ఉపాధి వంటి హామీలు
Advertisement
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తుండడం తెలిసిందే. ఇవాళ విజయదశమి సందర్భంగా ఆయన తన పార్టీ ఎప్పుడు ప్రకటించేది వెల్లడించారు. నవంబర్ 11వ తేదీన, ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఎ-కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఉంటుందని సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.  

ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీలు, రెండు కుటుంబాల దోపిడీకి ముగింపు పలకడమే తమ ప్రధాన ఎజెండా అని ఈ ప్రకటనలో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కుల, మత రాజకీయాలను తిరస్కరించి, 'రెడ్ బుక్-రప్పా రప్పా ఫ్యాక్షన్ల' నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. అమ్మవారి దీవెనలతో, ప్రజల ఆకాంక్షలే ఎజెండాగా పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా తమ పార్టీ సిద్ధాంతాలను, ప్రజలకు ఇవ్వబోయే హామీలను కూడా విజయసాయి రెడ్డి ఆవిష్కరించారు. కరవు కాటకాలు, కరెంటు కోతలు లేని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తామని, ప్రతి ఎకరాకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్తు, యువతకు 100 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయాలు పెంచి, ఖర్చులు తగ్గించడం వంటి కీలక హామీలను ఆయన ముందుంచారు. 80 ఏళ్లుగా నెరవేరని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, యువత కోసం "జెన్-జీ నాయకుల తయారీ ఫ్యాక్టరీ"గా తమ పార్టీ పనిచేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

విజయసాయి రెడ్డి, ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీలో కీలక వ్యూహకర్తగా వ్యవహరించారు. గత ఎన్నికల తర్వాత ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఏదో ఒక ప్రధాన పార్టీలో చేరతారని భావించినప్పటికీ, సొంతంగా పార్టీ ఏర్పాటు చేయడానికే మొగ్గుచూపారు. ఏపీలో విజయసాయి పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. 
Advertisement
Advertisement
Vijayasai Reddy
New Political Party
Andhra Pradesh Politics
Vijayawada
Gen Z Leadership
Ex YSRCP Leader

More Telugu News